Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб A man and two pots Telugu moral story || రెండు కుండల కథ @BAMMA KATHALU ​ в хорошем качестве

A man and two pots Telugu moral story || రెండు కుండల కథ @BAMMA KATHALU ​ 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



A man and two pots Telugu moral story || రెండు కుండల కథ @BAMMA KATHALU ​

#aman #twopots #moralstory ******రెండు కుండల కథ********* ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారి పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ గర్వంతో పొంగిపోయేది. " చూడు.. చూడూ.. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను.. నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు.. నీవు నాకు జోడీనే కాదు.. నీలాంటి వాళ్ళను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు.. తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు.." అని తరచూ వెక్కిరించేది. దాంతో పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఓ రోజు పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు" అంది. " నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు?" అడిగాడు పనివాడు. "ఇన్ని రోజులు నేను సగం నీళ్ళే మోయగలగుతున్నాను. ఈ పగుళ్ళు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నావల్ల నీకు అదనపు పని అవుతుంది. నీకష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు" అని బాధపడిందా పగుళ్ళ కుండ. దాని బాధను అర్ధం చేసుకున్న పనివాడు "బాధపడకు, ఈ రోజు చెరువునుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు" అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్ళ కుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. పనివాడు ఆ కుండతో "కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి. మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తానో తెలుసా...? నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే, నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. నువ్వు పగుళ్ళతో లేకపోతే యజమాని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండేవికావు" అన్నాడు. పగుళ్ళ కుండ తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. తన భాధను అర్ధం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే... "లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికే సంతోషం దక్కుతుంది. "

Comments